OCTOBER, 2022 < Back
కుటుంబాలు నిర్వచించడం, నిర్మాణం చేయడం, తరతరాలుగా విజయాన్ని కొనసాగించడంలో సహాయపడే ముఖ్యమైన పత్రాలు.
వాటాదారుల ఒప్పందాలు యాజమాన్యం ఫ్రేమ్‌వర్క్, నియమాల గురించి స్పష్టతను అందిస్తాయి. ఇవి కుటుంబ వ్యాపారానికి యజమానిగా ఉండటానికి యాజమాన్య విలువ, యాజమాన్య బదిలీ లేదా విక్రయ ఎంపికలు, ఓటింగ్ హక్కులు,బోర్డు సభ్యుల ఎంపిక వంటి వివిధ అంశాలను నిర్వచించే చట్టపరమైన పత్రాలు. ఇవి వాటాదారులు తమ యాజమాన్య ఆసక్తులను ఎలా నిర్వహించాలో చట్టపరమైన ఆధారాన్ని ఏర్పరుస్తాయి. ఆ ప్రయోజనం గుర్తించే పనిపై ఏర్పాటు చేయబడిన వాటాదారుల సమూహాలు సమయం, శక్తి ల సరైన పెట్టుబడితో ఈ ఒప్పందాలను రూపొందించడం చాలా సులభం.ఒకే యజమాని ప్రారంభించిన వ్యాపారాలకు వాటాదారుల ఒప్పందం అంత అవసరం లేదు. యాజమాన్యం తరువాతి తరానికి (సాధారణంగా తోబుట్టువుల దశలో) బదిలీ చేయబడుతున్నప్పుడు, ఒప్పందం నిబంధనలను అంగీకరించడానికి వాటాదారుల సమూహం చాలా పెద్దదిగా మారడానికి ముందు సాధారణంగా వాటాదారుల ఒప్పందాలు సృష్టించబడతాయి.
కార్పోరేట్ బైలాస్ అనేవి కార్పొరేషన్ ఎలా ముందుకు నడవాలో నియంత్రించే విధానాలు, నియమాలు,ప్రమాణాలు. బైలాస్ అనేవి సంస్థలోని మేనేజర్లకు కీలక సూచన పాయింట్స్ గా ఉండడంతో పాటు బోర్డు ఎలా ఓటు వేయాలి అనే నిబంధనలను కూడా వివరిస్తాయి.అభివృద్ధి చెందుతున్న, పెరుగుతున్న సంక్లిష్ట వ్యాపార అవసరాలను తీర్చడానికి పెరుగుతున్న నిర్మాణాన్ని రూపొందించడంలో ఈ పత్రాలు ప్రత్యేకంగా సహాయపడతాయి. బైలాస్ త్వరగా ఔట్ డేట్ అవ్వడంతో పాటు వ్యాపారంతో సంబంధాన్ని కోల్పోతాయి. అర్హత పొందిన వ్యాపార న్యాయవాదులు ఈ డాక్యుమెంట్లను చురుకైన పద్ధతిలో రూపొందించడంలో, వీటిని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉన్నందున సకాలంలో సమీక్ష షెడ్యూల్‌ని నిర్ధారించడానికి సహాయం చేస్తారు.
ఆస్తులు ఒక తరం నుండి మరొక తరానికి ఎలా బదిలీ చేయబడతాయో ఎస్టేట్ ప్లానింగ్ పత్రాలు వివరిస్తాయి. ఈ పత్రాలు తరచుగా తరాలకు సంపదను ప్రభావితం చేసే ట్రస్ట్‌లను సృష్టిస్తాయి. అల్లగే ఆస్తులపై కుటుంబ ప్రభావం, నియంత్రణ ఎలా ఉంటుందనే వాటి కోసం నిర్మాణాన్ని రూపొందించడంలో ముఖ్యమైన మార్గంగా ఉంటాయి. ఇవి ఎస్టేట్ ప్లానింగ్ పత్రాలు మంజూరు చేసేవారితో పాటు న్యాయవాదులచే సృష్టించబడతాయి. పత్రాలు తరచుగా వ్యాపార తదుపరి యజమానులకు వివిధ స్థాయిలలో సంపదను బదిలీ చేసినప్పుడు పన్నును తగ్గించడానికి రూపొందించబడతాయి. సరైన ఎస్టేట్ ప్లానింగ్ కుటుంబానికి స్పష్టత, నిశ్చయతను ఏర్పరుస్తుంది. ట్రస్ట్ విషయంలో, ట్రస్టీల నియామకంలో, లబ్ధిదారులతో వారి సంబంధాలతో పాటు, భవిష్యత్ యాజమాన్యంపై ముఖ్యమైన సంబంధాలను కలిగి ఉంటుంది, ఎందుకంటే సాంకేతికంగా ట్రస్ట్ వాటాలను కలిగి ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు నేరుగా కాదు. ఎస్టేట్ ప్లానింగ్ లేకపోవడం కుటుంబ సంస్థ మనుగడకు ముప్పు కలిగిస్తుంది ఎందుకంటే అత్యధికంగా, అత్యంత అననుకూలమైన రేట్ల వద్ద పన్ను విధించడం వల్ల కంపెనీ అవాంఛిత పాక్షిక లేదా పూర్తి విక్రయం జరుగుతుంది. అదనంగా కొన్ని ట్రస్ట్ నిర్మాణాలు అనాలోచితంగా లబ్ధిదారులకు, యాజమాన్యానికి మధ్య చాలా దూరాన్ని సృష్టించగలవు. తద్వారా వారికి సంస్థ నుండి డిస్కనెక్ట్ అవుతున్నామనే భావన ఉద్భవించవచ్చు. అందువల్ల ట్రస్ట్ నిర్మాణాలను జాగ్రత్తగా రూపొందించాలి.
"మనం ఎందుకు కలిసి వ్యాపారం చేస్తున్నాము?" - వ్యాపార కుటుంబాలు తప్పక అడగవలసిన, తదనంతరం సమాధానం ఇవ్వవలసిన ముఖ్యమైన ప్రశ్న. బలమైన ఉద్దేశ్యాన్ని నిర్వచించే, సృష్టించే కుటుంబాలు సాధారణంగా ఈ రకమైన పత్రంలో బలం, సమలేఖనాన్ని కనుగొంటాయి. ఈ ప్రకటన కుటుంబ, వ్యాపార అవసరాలను బట్టి క్లుప్తంగా లేదా చాలా వివరంగా ఉంటుంది. కొన్ని కుటుంబాలు విజన్, ఉద్దేశ్యం, నిర్దిష్ట లక్ష్యాల లాంటి వివిధ అంశాలను ప్రత్యేక పత్రాలుగా వేరు చేస్తాయి. మరికొందరు మాత్రం మరింత సాధారణీకరించిన స్టేట్మెంట్ ను కలిగి ఉంటారు. ఏదైమైనప్పటికీ ఈ ప్రకటనలు ఔత్సాహిక కుటుంబానికి ఒక ఉమ్మడి ధోరణి, సూచన పాయింట్‌ని కలిగి ఉండటానికి అర్ధవంతమైన మార్గాన్ని అందించగలవు. ఒక స్పష్టమైన ప్రకటన మార్గదర్శకంగా పనిచేయడంతో పాటు వ్యాపారం, కుటుంబం తరపున యజమానుల, నిర్వాహకుల, బోర్డు సభ్యుల చర్యలను సమలేఖనం చేస్తుంది. వ్యాపార విలువల ప్రకటనతో పాటు చాలా కుటుంబాలు కుటుంబ అత్యంత ముఖ్యమైన విలువలు, సూత్రాలను వివరించే ప్రకటనను రూపొందిస్తాయి. ఈ రకమైన పత్రాలు కుటుంబ సంస్కృతిని నిర్వచిస్తాయి, ప్రభావితం చేస్తాయి, నిలబెడతాయి. విలువల ప్రకటనలు కుటుంబం దేనిని సూచిస్తుందో అనేదానికి శాశ్వత గుర్తులుగా ఉపయోగపడడంతో పాటు అవి కుటుంబ విలువలను సమీక్షించి, రిఫ్రెష్ చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ముఖ్యమైన సూచనగా కూడా ఉంటాయి. కుటుంబ సమావేశాలు ఈ ప్రకటనలను బిగ్గరగా చదవడం ద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేసి వాటిని క్రమం తప్పకుండా సూచించడం ద్వారా వాటికి జీవం పోసేలా రూపొందించబడతాయి.
ప్రవర్తన, ప్రతిస్పందన లకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్వచించిన కుటుంబాలు కలిసి వ్యాపారంలో కుటుంబ సభ్యులుగా ఉండాలనే ఛార్జ్డ్ ఎమోషనల్ కోణాన్ని మెరుగ్గా నిర్వహించగలుగుతాయి. ప్రవర్తనా నియమావళి ప్రవర్తన, కమ్యూనికేషన్, పరస్పర చర్య కోసం ఒక రక్షణ అందజేస్తుంది. ఇది ప్రతి ఒక్కరికీ మరింత ఆబ్జెక్టివ్ వీక్షణను అందించడంలో సహాయపడుతుంది. కమ్యూనికేషన్ గ్రౌండ్ రూల్స్ కుటుంబానికి, ముఖ్యంగా కుటుంబ సమావేశ సమయంలో గౌరవప్రదంగా, ప్రభావవంతంగా ఎలా ఉండాలో వివరిస్తాయి. పత్రాలు పెద్ద, చిన్న సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ తటస్థ, పరస్పరం అంగీకరించిన గ్రౌండ్ రూల్ సెట్‌ను అందిస్తాయి. ఈ మార్గదర్శకాలు పబ్లిక్ చర్యలు, కుటుంబ సభ్యుల విజిబిలిటి కు కూడా విస్తరించవచ్చు. వ్యక్తిగత కుటుంబ సభ్యులు సోషల్ మీడియాను ఉపయోగించడం ఇతరులపై ప్రతికూల ప్రభావం చూపకుండా చూసేందుకు సోషల్ మీడియా విధానాలు అభివృద్ధి చేయబడతాయి. ఈ ఒప్పందాలకు కట్టుబడి ఉండటం ద్వారా కుటుంబ సమావేశాలు మార్గనిర్దేశం చేస్తాయి. సరియైన ట్రాక్‌లో ఉంచబడతాయి.
ఏదైనా వర్కింగ్ గ్రూప్‌కి దాని ప్రయోజనం, లక్ష్యాలు, పాత్రలు,బాధ్యతలను నిర్వచించడానికి ఒక చార్టర్ అవసరం. విశ్వసనీయ బోర్డుల వంటి చట్టపరమైన సంస్థలకు, కుటుంబ కౌన్సిల్ల వంటి కుటుంబ పాలన సమూహాలకు,టాస్క్‌ఫోర్స్‌లు, కమిటీలకు ఇది వర్తిస్తుంది. గవర్నెన్స్ చార్టర్లు ఈ సమూహాల ప్రాథమిక నిర్మాణాలను నిర్వచించడంతో పాటు వారి లక్ష్యాలను సాధించడానికి అవసరమైన మార్గదర్శకాలను అందిస్తాయి. అంటే గవర్నెన్స్ ఫోరమ్‌ల మధ్య పాత్రలు, బాధ్యతలు, సరిహద్దులు, కమ్యూనికేషన్ మార్గాలను వివరించడం. ఈ అంశాలను నిర్వచించడం వలన సిస్టమ్ అంతటా సమర్థవంతమైన సరైన పనితీరు, సమాచార ప్రవాహానికి మద్దతునిస్తుంది. కుటుంబం, వ్యాపారం కోసం అత్యంత ప్రస్తుత పాలనా అవసరాలను తీర్చడానికి మార్పులు, అప్డేట్లను అనుమతించడం ద్వారా కుటుంబం అభివృద్ధి చెందుతున్నప్పుడు లేదా వాతావరణం మారుతున్నప్పుడు పాలనా చార్టర్లు గొప్ప స్థాయి సౌలభ్యాన్ని అందిస్తాయి.
కుటుంబ ఉపాధి విధానం వ్యాపారంలో పని చేయాలనుకునే కుటుంబ సభ్యుల కోసం ఆధారాలు, అంచనాలు, ఎంపిక ప్రమాణాలను వివరిస్తుంది. కుటుంబ సభ్యులు ఉపాధి కోసం ఎలా ఎంపిక చేయబడతారో వివరించడం వలన బంధుప్రీతి నిర్వహణ, మెరిట్ ను ప్రోత్సహించడంలో సహాయపడే మరింత న్యాయమైన, బహిరంగ ప్రక్రియను ఏర్పరచవచ్చు. ఈ పాలసీలు కుటుంబ సభ్యులకు న్యాయంగా, స్థిరంగా పరిహారం అందేలా పరిహార నిబంధనలను కూడా అందించగలవు. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు వ్యాపారంలో పని చేసే ముందు కుటుంబ ఉపాధి విధానాలు ఉత్తమంగా రూపొందించబడతాయి. ఈ రకమైన పాలసీలు లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులను నియమించుకోవడంపై అంచనాల గురించి కుటుంబ నిర్వహణలో గందరగోళం ఏర్పడవచ్చు. ఈ విధానాలు రూపొందించబడినప్పటికీ కుటుంబ కోరికలు నిష్పాక్షిక, వాస్త విక విధానంతో విభేదించినప్పుడు వాటిని పాటించడంలో సవాళ్లు ఉండవచ్చు. కుటుంబ ఉపాధి పాలసీని సాధారణంగా కుటుంబేతర నిర్వాహకులు, కుటుంబ వ్యాపార సలహాదారుల ఇన్‌పుట్‌తో ఆదర్శంగా కుటుంబం రూపొందిస్తుంది. వ్యాపార కుటుంబాలు ఇతర కుటుంబాల కోసం పనిచేసిన ఉపాధి పాలసీల నుండి నేర్చుకొని ఆ వివరాలను తమ ప్రత్యేక పరిస్థితికి అనుగుణంగా మార్చుకోవచ్చు.
అనేక కుటుంబ వ్యాపారాలు ఒక తరం నుండి మరొక తరానికి కొనసాగింపును కోరుకుంటున్నందున వ్రాతపూర్వక, దీర్ఘకాలిక వారసత్వ ప్రణాళికను కలిగి ఉండటం వలన ఆ లక్ష్యానికి బలంగా మద్దతు లభిస్తుంది. ఈ రకమైన ప్రణాళిక కుటుంబ సభ్యులకు, కుటుంబేతర నిర్వహణకు స్పష్టత,స్థిరత్వాన్ని తీసుకురాగలదు. ఎందుకంటే వారికి అన్ని వివరాలు బహిరంగా లభించకపోయినా ఒక ప్రణాళిక ఉందని తెలుస్తుంది. ఒక సంక్షోభం సంభవించినట్లయితే వ్రాతపూర్వక ప్రణాళికను కలిగి ఉండటం వలన అత్యంత భావోద్వేగ సంఘటన మధ్య వ్యాపారాన్ని నిర్వహించే వ్యక్తులపై చాలా ఒత్తిడిని తగ్గించవచ్చు. ఈ డాక్యుమెంట్‌ను సీనియర్ మేనేజ్మెంట్ బృందం నుండి తగిన ఇన్‌పుట్‌తో వ్యాపార నాయకత్వం వ్రాసుకోవాలి. చాలా గవర్నెన్స్ చార్టర్లకు సి.ఈ.ఓ., మేనేజ్మెంట్ బృందం దీర్ఘకాలిక, అత్యవసర వారసత్వ ప్రణాళిక రెండింటినీ రూపొందించాలి. ఈ రకమైన ముందస్తు ఆలోచన సిబ్బంది సామర్థ్యాల్లోని అంతరాలను గుర్తించడానికి, వాటిని వ్యూహాత్మకంగా పరిష్కరించడానికి సమయాన్ని అనుమతిస్తుంది.
కుటుంబ రాజ్యాంగం అనేది వారి యాజమాన్య ప్రయత్నాలలో కుటుంబాన్ని నియంత్రించడంలో సహాయపడే పూర్తి ఒప్పందాలు, డాక్యుమెంట్. ఈ ఆర్టికల్‌లో జాబితా చేయబడిన అన్ని డాక్యుమెంట్లు (వ్యక్తిగత ఎస్టేట్ ప్లాన్లు మినహా) కుటుంబ, వ్యాపార చారిత్రక సమాచారం వంటి ఇతర డాక్యుమెంటేషన్‌తో పాటు రాజ్యాంగంలోని విభాగాలను ఏర్పరుస్తాయి. కాలానుగుణంగా రాజ్యాంగాలు నవీకరించబడాలి. కుటుంబ రాజ్యాంగం కుటుంబ సంరక్షకునిగా పనిచేస్తుంది — వ్యాపార కుటుంబాన్ని నిర్వహించడానికి మార్గనిర్దేశం చేసే అత్యంత ముఖ్యమైన అంశాల కీపర్. పైన జాబితా చేయబడిన అనేక కుటుంబ-ఆధారిత పత్రాలకు, పత్రాలను అభివృద్ధి చేయడానికి న్యాయమైన, సమగ్ర ప్రక్రియను కలిగి ఉండటం అంతిమ ఫలితం ఎంత ముఖ్యమైనదో అంత ముఖ్యమైనది. దీని సృష్టి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేటప్పుడు అందరు వాటాదారుల నుండి ఇన్పుట్ను సేకరించడం సవాలుగా అనిపించవచ్చు కానీ ఈ ప్రయత్నంలో పెట్టుబడి పెట్టడం మాత్రం విలువైనదే. ఇది నిజంగా అంతులేని ప్రక్రియ.కానీ విజయవంతమైన ఔత్సాహిక కుటుంబం ముఖ్య లక్షణం నిరంతర అభివృద్ధి,అభివృద్ధిలో కొనసాగుతున్న పెట్టుబడి అని గ్రహించాలి.
Share on
Get your monthly subscription
S.V.M. Sastry
Sri S.V.M. Sastry, now working as Senior Consultant in Parampara Family Business Institute (PFBI) was a retired General Manager of State Bank of Hyderabad. After retirement, he joined GMR group in 2004. He was instrumental in setting up Family Office which functioned as nodal point for conducting family meetings to shape the Family Constitution, the first version of which was signed by GMR Family in 2007. There after he worked with leading legal experts to create Trusts in the names of the four family branches which were given 25% of ownership share each.